విశాఖ మన్యంలో బంద్ సంపూర్ణ విజయం ..ఉవ్వెత్తున ఎగసిపడిన ఆందోళనలు, నిరసనలు ..కనీవినీ ఎరుగని రీతిలో బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొన్న ఆదివాసీలు

విశాఖ ఏజెన్సీలో గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి హక్కులు, చట్టాలు పరిరక్షణ సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చిన బంద్ సంపూర్ణ విజయవంతమైంది. జేఏసీ నాయకులు గిరిజన ప్రాంతంలో భూ బదలాయింపు చట్టాలు సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల బందుకు  పిలుపునిచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. తొలిరోజు సోమవారం బంద్ ఊహించని  రీతిలో విజయవంతమైంది. ఉదయం ఐదు గంటల నుంచే జేఏసీ నాయకులు రహదారులపై కి చేరుకొని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రధాన రహదారులపై బైఠాయించి ఆందోళనలు నిరసనలు తెలియజేశారు. విద్యార్థులు జేఏసీ నాయకులు , వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు  ఆందోళన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిరిజన ప్రాంతంలో భూ బదలాయింపు చట్టం అమలు చేసే వరకు ఆందోళనలు దశలవారీగా ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు ప్రకటించారు . బంద్ కారణంగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి . జనజీవనం స్తంభించిపోయింది . వారపు సంతలు రద్దు కాబడ్డాయి . మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. అరకు పాడేరు చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో బోసిపోయాయి. బంద్ కారణంగా పర్యాటకులు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామా గ్రామాల్లో ఆదివాసీలు గృహాల నుంచి రహదారులకు చేరుకొని  నిరసన వ్యక్తం చేశారు. రహదారి పైనే భోజనాలు చేశారు . అలాగే అర్ధరాత్రి వరకు రహదారులపై చలిమంటలు వేసుకొని జేఏసీ నాయకులు ఆందోళనను కొనసాగించారు . 
మండలాలు ప్రాంతాలవారీగా.. జరిగిన ఆందోళనలను చిత్రాలు ..
చింతపల్లిలో రహదారిపై భోజనాలు చేస్తున్న జేఏసీ నాయకులు
రహదారిపై టెంట్లు వేసుకుని బస చేసేందుకు సిద్ధపడుతున్నారు జేఏసీ నాయకులు 
రహదారిపై టెంట్లు వేసుకుని బస చేసేందుకు సిద్ధపడుతున్నారు జేఏసీ నాయకులు  
లంబసింగిలో ఆందోళన చేపడుతున్న జేఏసీ నాయకులు
చింతపల్లిలో రాత్రి తాజా పరిస్థితి  
గూడెంకొత్తవీధి లో 
లంబసింగిలో ఆందోళన చేపడుతున్న జేఏసీ నాయకులు
పాడేరులో 
అనంతగిరి మండలం చిలకల గడ్డ వద్ద 
అన్నవరంలో జేఏసీ నాయకుడు సునీల్ ఆధ్వర్యంలో ర్యాలీ 
పాడేరులో దిమ్స నృత్యం చేస్తూ నిరసన తెలుపుతున్న మహిళలు 
దారకొండ లో రహదారిపై బైఠాయించి ఆందోళన కారులు 

Post a Comment

1 Comments