జడ్పీటీసీ,ఎంపిపి అన్ని స్థానాల్లోనూ
మహిళలకు 50 శాతం రిజర్వు
39 జడ్పీటీసీల్లో....15 జనరల్, బీసీలకు 11, ఎస్టీలకు 10, ఎస్సీలకు 3
ఏజెన్సీలో ఇతరులకు, మైదానంలో ఎస్టీలకు రిజర్వేషన్
మండలాధ్యక్ష పదవుల్లో బీసీలకు పెద్దపీట
బలహీన వర్గాలకు 17 మండలాలు
ఎస్టీలకు 12, ఎస్సీలకు మూడు, జనరల్‌లో ఏడు
స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లా కలెక్టర్ ఈ మేరకు గురువారం రాత్రి గజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. జిల్లాలో ఎంపీపీ, జడ్పీటీసీ పదవులు 39 చొప్పున ఉన్నాయి. జడ్పీటీసీల్లో 11 స్థానాలు బీసీలకు, పది ఎస్టీలకు, మూడు ఎస్సీలకు కేటాయించారు. 15 స్థానాలు జనరల్‌లో ఉంచారు. ఎస్టీలకు కేటాయించిన పది సీట్లు మైదాన ప్రాంతంలో వుండడం గమనార్హం. ఏజెన్సీలోని 11 మండలాల్లో ఒక్కటి కూడా ఎస్టీలకు ఇవ్వలేదు.
నాలుగు బీసీలకు కేటాయించగా, ఏడు అన్‌రిజర్వుడ్‌లో ఉన్నాయి. మొత్తం మీద ఆయా కేటగిరీల్లో 50 శాతం స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. ఇక మండలాధ్యక్ష (ఎంపీపీ) పదవుల విషయానికి వస్తే...బీసీలకు 17 రిజర్వు చేయగా, ఎస్టీలకు 12, ఎస్సీలకు మూడు కేటాయించారు. ఏడు స్థానాలు జనరల్ అయ్యాయి.
ఎంపీపీ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేశారు. 17 మండలాలను బీసీలకు రిజర్వు చేశారు. ఎస్టీలకు 12 రిజర్వు చేయగా, వీటిల్లో 10 స్థానాలు ఏజెన్సీలో, మరో రెండు మైదాన ప్రాంతం(నాతవరం, గొలుగొండ)లో ఉన్నాయి. ఏజెన్సీలో అనంతగిరిని బీసీలకు కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో మూడు ఎస్సీలకు రిజర్వు చేయగా, ఏడు స్థానాలు జనరల్‌లో ఉంచారు. కాగా అన్‌రిజర్వుడ్ స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీలు కూడా పోటీ చేసే వెసులుబాటు ఉంది.
1995లో ఎంపీటీసీ, జడ్పీటీసీలు ప్రారంభమైన తరువాత ఐదో పర్యాయం జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. గురువారం రాత్రి కలెక్టర్ గజిట్ విడుదల చేశారు. మొత్తమ్మీద 19 జడ్పీటీసీ స్థానాలు, 21 మండలాధ్యక్ష పదవులను మహిళలకు కేటాయించారు.
ఇదిలావుండగా స్థానిక సంస్థల ఎన్నికలపై శుక్రవారంలోగా హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అందుకే జడ్పీటీసీ/ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. గత వారం మంత్రివర్గం ఆమోదం తెలిపిన విధంగానే 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తే ప్రస్తుతం తయారుచేసిన జాబితాలు రద్దు అవుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
మండలాల రిజర్వేషన్ వివరాలు
మండలం జడ్పీటీసీ- ఎంపీపీ రిజర్వేషన్ రిజర్వేషన్
భీమిలి ఎస్టీ జనరల్ - బీసీ
ఆనందపురం బీసీ జనరల్ -బీసీ
పద్మనాభం ఎస్టీ జనరల్ -బీసీ
పెందుర్తి బీసీ మహిళ - బీసీ
పరవాడ ఎస్టీ జనరల్ - బీసీ
సబ్బవరం బీసీ జనరల్- బీసీ
నర్సీపట్నం ఎస్టీ మహిళ - జనరల్ మహిళ
మాకవరపాలెం ఎస్టీ మహిళ జ - మహిళ
నాతవరం జనరల్ - ఎస్టీ మహిళ
గొలుగొండ జనరల్ - ఎస్టీ
అనకాపల్లి జనరల్ - జనరల్
కశింకోట ఎస్టీ మహిళ - జనరల్ మహిళ
చోడవరం ఎస్టీ మహిళ - ఎస్సీ ఎస్టీ మహిళ బీసీ మహిళ
రావికమతం బీసీ మహిళ - బీసీ మహిళ
రోలుగుంట ఎస్సీ మహిళ - బీసీ
పాయకరావుపేట ఎస్టీ జనరల్ - జనరల్
కోటవురట్ల జనరల్ మహిళ - బీసీ మహిళ
నక్కపల్లి ఎస్సీ జనరల్ - బీసీ మహిళ
ఎస్.రాయవరం జనరల్ మహిళ - బీసీ మహిళ
ఎలమంచిలి జనరల్ మహిళ - ఎస్సీ మహిళ
అచ్యుతాపురం ఎస్టీ జనరల్ - బీసీ
మునగపాక బీసీ జనరల్ - బీసీ మహిళ
రాంబిల్లి జనరల్ - జనరల్
వి.మాడుగుల ఎస్సీ జనరల్ - ఎస్సీ మహిళ
కె.కోటపాడు బీసీ జనరల్ - బీసీ మహిళ
దేవరాపల్లి బీసీ జనరల్ - బీసీ మహిళ
చీడికాడ జనరల్ - జనరల్ మహిళ
అరకులోయ జనరల్ మహిళ - ఎస్టీ మహిళ
ముంచంగిపుట్టు బీసీ మహిళ - ఎస్టీ
హుకుంపేట బీసీ మహిళ - ఎస్టీ
డుంబ్రిగుడ బీసీ మహిళ - ఎస్టీ
పెదబయలు బీసీ మహిళ - ఎస్టీ మహిళ
అనంతగిరి జనరల్ -బీసీ మహిళ
పాడేరు జనరల్ మహిళ - ఎస్టీ
జి.మాడుగుల జనరల్ - ఎస్టీ మహిళ
కొయ్యూరు జనరల్ - ఎస్టీ మహిళ
చింతపల్లి జనరల్ - మహిళ ఎస్టీ
జీకే వీధి జనరల్ మహిళ - ఎస్టీ మహిళ
0 Comments