పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఒక్క రోజు తగ్గాయి. విద్యా సంవత్సరం కేలండర్ ప్రకారం ఈ నెల 11 నుంచి 16 వరకు ఉండాల్సిన సెలవులు 12వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలో పాఠశాలలకు ప్రభుత్వం దసరా సెలవులను పొడిగించింది. ఈ నేపథ్యంలో ఆ సెలవులను భర్తీ చేసేందుకు ఏప్రిల్ వరకు ప్రతి నెల రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న రెండో శనివారం కావడంతో పనిదినంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యా కమిషనర్ విజయకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో సంక్రాంతి సెలవులు ఆ మరుసటిరోజు(12వతేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. రెండో శనివారాలైన ఫిబ్రవరి 8న, మార్చి 14న, ఏప్రిల్ 11న కూడా పాఠశాలలు యథావిధిగా పని చేస్తాయి. ఇక ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం ‘నిష్టా’ను ఈ నెల 27కు వాయిదా వేశారు. కాగా, అకాడమిక్ కేలండర్‌ను పాటించకపోవడం దారుణమంటూ ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్, పీఆర్టీయూ, ఎస్టీయూ, టీటీయూ, టీఎస్టీయూ, ఎస్జీటీ ఫోరం, ఎస్జీటీయూ, టీటీఎఫ్, టీపీయూఎస్, టీఎ్‌సపీటీఏ వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశాయి. ఇక ఇంటర్ కాలేజీలకు ఈ నెల 13- 15 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ తెలిపారు.
0 Comments