రెండురోజుల మన్యం బంద్ విజయవంతం ఆదివాసీలను ఏకం చేసి సత్తాచాటిన జేఏసీ 48గంటలు తెరుచుకొని దుకాణాలు.. కదలని వాహనాలు ఊరువాడా ఓకే నినాదం.. ''ఆదివాసీల చట్టాలు, హక్కులు పటిష్టంగా అమలుపర్చాలి'' చరిత్ర తిరగరాసిన అడవిపుత్రులు

రెండురోజుల మన్యం బంద్ విజయవంతం 
ఆదివాసీలను ఏకం చేసి సత్తాచాటిన జేఏసీ 
48గంటలు తెరుచుకొని దుకాణాలు..  కదలని వాహనాలు 
ఊరువాడా ఓకే  నినాదం.. ''ఆదివాసీల చట్టాలు, హక్కులు పటిష్టంగా అమలుపర్చాలి'' 
చరిత్ర తిరగరాసిన అడవిపుత్రులు 

విశాఖ మన్యం పేరు చెప్పగానే అందరికి మనస్సులో ప్రకృతి అందాలు పరుగులు పెడతాయి. పచ్చని అడవి, పక్షుల కికిల రాగాలు, పారె సెలయేరులు, జపాతాలు కల్మషంలేని ఆదివాసీ జీవనం  మదిలో గుసగుసలాడుతుంది. అదే మన్యం రెండురోజులు రగిలిపోయింది. విశాఖ ఏజెన్సీలో  ఆదివాసీ చట్టాలు, హక్కులు అమలుకావడం లేదని, అధికారులు, పాకుల నిర్లక్ష్యం వల్ల  అడవిపుత్రులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం, మంగళవారం ఏజెన్సీ బంద్ కు జేఏసీ పిలుపునిచ్చింది. తొలిరోజు బంద్  సంపూర్ణ  విజయవంతమైంది. రెండోరోజు కూడా మొదటిరోజుకు మించి ఆదివాసులు బంద్ చేశారు. ఆదివాసీలను చైతన్యపరిచి ప్రతి ఒక్కరు బంద్ లో పాల్గొనేలా జేఏసీ కృషిచే సత్తాచాటింది. మంగళవారం ఏజెన్సీ లో జరిగిన బంద్ పటిమను "మైన్యూస్" పాఠకులకు మోసుకొచ్చిన వార్త విశేషాలు.. 

ఏజెన్సీ డివిజన్ హెడ్ క్వార్టర్ పాడేరులో 
కోడికూత ముందే జేఏసీ నాయకులు రహదారులపైకి చేరుకున్నారు. ఒక్క వాహనం కూడా తిరగకుండా జేఏసీ నాయకులు చర్యలు తీసుకున్నారు. పలుచోట్ల రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేసారు . చిన్నాపెద్దా ఆడామగా కలసి ధింసా నృత్యం చేసి నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సుమారు అత్యధిక సంఖ్యలో నాయకులు , గిరిజనులు , విద్యార్థులు పాల్గొన్నారు . 
మాజీ  మంత్రి శ్రావణ్ రహదారిపై భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేసిన దృశ్యం 
జి.మాడుగులలో 


చింతపల్లి లో 
చింతపల్లి లోనూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది . సోమవారం రాత్రి జేఏసీ నాయకులు హనుమాన్ జంక్షన్ టూర్ టెంట్లలో బస చేసారు. ఉదయం నుంచి ఆందోళనలు చేసారు. మధ్యాహ్నం రహదారిపైనే వంటలు చేసుకొని భోజనాలు చేసి నిరసన తెలిపారు. గిరిజన మహిళలు , గిరిజనులు, ఉద్యోగులు కలిసి ధింసా నృత్యం చేసారు. సాయంత్రం చింతపల్లి పట్టణం లో భారీ ర్యాలీ చేసారు . 


 

చింతపల్లి ధింసా .. 

గూడెంకొత్తవీధి లో ర్యాలీ 

ఆంధ్ర కశ్మిర్  లంబసింగి లో 

కొయ్యురు మండలం మర్రిపాలెం లో 

ధారకొండ లో 




Post a Comment

0 Comments