అధ్యాపకుడి ఖాతాలో రూ.3 లక్షలు మాయం!

బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలలో లెక్కల అధ్యాపకుడిగా చేస్తున్న పావులూరి విజయసారథి బ్యాంక్‌ఖాతా లో రూ.3లక్షలు మాయమయ్యాయి. బాపట్ల రూరల్‌ ఎస్‌ఐ ఎం. సంధ్యరాణి తెలిపిన వివరాల ప్రకారం... పొన్నూరుకు చెందిన విజయసారథి ఉద్యోగరీత్యా బాపట్లలోఉంటూ ఇంజనీరింగ్‌ కళా శాలలో మ్యాథ్స్‌ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 10న ఆయనకు ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘మేము మీ ఏటీఎం కార్డును బ్లాక్‌ చేస్తున్నాం. సరైన సమాచారమిస్తే బ్లాక్‌ చేయకుండా ఉం టా’మని ఫోన్‌ చేసిన వ్యక్తి తెలిపారు. దీంతో తన సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నెంబరును ఫోన్‌కాల్‌ వచ్చిన నెంబరుకు చేసి చెప్పారు.అవతలవారు ‘మీ అకౌంట్‌ నుంచి రూపాయి డెబిట్‌ చే స్తాం వెంటనేకార్డు యాక్టివేట్‌ అవుతుం’దని తెలిపారు.ఆ విధంగానే సమాచారం వచ్చింది. మరుసటిరోజు రూ.20వేలకు పైగా డెబిట్‌ అయ్యింది. తన బావమరిది అమెరికా నుంచి పంపిన డబ్బుకు ఛార్జీలు పడినవని విజయసారథి భావించారు. అనంత రం ఎటువంటి మెసేజీలు రాకుండానే రూ.3లక్షలలు తన ఖాతా నుంచి మయమయ్యాయి. దీంతో ఆయన కళాశాలలోని బ్యాంక్‌ లో తన స్టేట్‌మెంట్‌ను తీసుకొని మంగళవారం రూరల్‌ పోలీసు లకు ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments