నర్సీపట్నం (సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బిఎల్ స్వామి) మార్చి 30: నర్సీపట్నం మండలం మరియు, టౌన్ నాయకులకు కార్యకర్తలకు ప్రశిక్షణ కార్యక్రమం నర్సీపట్నం పార్టీ కార్యాలయంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు బోలెం అప్పన్న దొర, మండల అధ్యక్షులు నిద్ర శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు కిల్లాడ వెంకట సత్యనారాయణ గారు విచ్చేసి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బీజేపీ వక్తలు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యకర్తలకు నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కార్యకర్తలకు నాయకులకు, నాయకత్వ లక్షణాలు, మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు, భారతీయ జనతా పార్టీ చరిత్ర గూర్చి ఈ శిక్షణ కార్యక్రమంలో వివరించడం జరిగింది గ్రామీణ స్థాయి నుండి పార్టీని ఎలా బలోపేతం చేయాలి ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు ఎలా చేరవేయాలని అనే విషయాలు ఈ శిక్షణ కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు వందకు పైగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు . ఈ శిక్షణ కార్యక్రమంలో ఓబిసి జిల్లా కార్యదర్శి బోలెం శివ, సీనియర్ నాయకులు గాదే శ్రీనివాసరావు, కాళ్ళ సుబ్బారావు, గవిరెడ్డి త్రినాథ్, కోట్ని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
0 Comments