ఈవీఎం గోదాముల‌ను త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ఏ ఎస్ దినేష్ కుమార్

ఈవీఎం గోదాముల‌ను త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ఏ ఎస్ దినేష్ కుమార్
ఏఎస్ఆర్ జిల్లా, పాడేరు, నవంబర్ 29 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్):-  స్థానిక డిగ్రీ కళాశాలలో గల  రూమ్ లో భద్రపరిచి ఉన్న  ఈవీఎం గోదాముల‌ను వివిధ ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్ట‌ర్ ఏఎస్ దినేష్ కుమార్ త‌నిఖీ చేశారు. నెలవారీ త‌నిఖీల్లో భాగంగా శనివారం ఉద‌యం ఈవీఎం గోదాముల‌ను సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. సీసీ కెమెరాల ప‌నితీరును, ప్ర‌ధాన ద్వారానికి ఉన్న సీళ్ల‌ను ప‌రిశీలించారు. భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై అక్క‌డ  అధికారులకు, పోలీస్ సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా విజిటింగ్ రిజిస్ట‌ర్లో సంత‌కం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఆర్ డి ఓ, డిప్యూటీ కలెక్టర్, ఏం వి ఎస్ లోకేశ్వరరావు, ఇంచార్జి డిఆర్ఓ అంబేద్కర్, టిడిపి ప్రతినిధి కె. రాజేష్, బిజెపి ప్రతినిధి కె ఆర్ రావు, వైఎస్ఆర్ సి పి ప్రతినిధి జి.వేణుబాబు  స్థానిక రెవెన్యూఅధికారులు, ఎల‌క్ష‌న్ సూపరిండెండెంట్ లక్ష్మణరావు, ఎలక్షన్ సెల్  అధికారులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments