పాడేరులో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

పాడేరులో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
పాడేరు, ఆగస్టు 9 (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్) :  ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పాడేరులో ఘన స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10.30గం.లకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లగిసిపల్లిలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ కు  ముఖ్యమంత్రి చేరుకున్నారు. హెలీప్యాడ్ కు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖామాత్యులు మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడ, పాడేరు సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్ తదితరులు పుష్పగుచ్చాలిచ్చి ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.

Post a Comment

0 Comments