పెండింగ్ పింఛన్ల నిల్వలను తిరిగి చెల్లించండి
జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ
పాడేరు, ఆగస్టు 19 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): లబ్దిదారులకు చెల్లించగా మిగిలిన సామాజిక పింఛన్ల నిల్వలను తిరిగి ప్రభుత్వానికి సత్వరమే చెల్లించాలని జాయింట్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ ఆదేశించారు. సచివాలయాల పరిధిలో వెల్ఫేర్ అసిస్టెంట్ల నుండి రికవరీ చేయాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి డి ఆర్ డి ఏ, డ్వమా, గిరిజన సంక్షేమ (విద్య) విద్యాశాఖ, గ్రామ వార్డు సచివాలయం, ఎస్ ఎం ఐ, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ నిధి రుణాలు ఆదేశించారు.10,686 సంఘాలకు రుణాలు రికవరీ చేయాలని అందించాలని బ్యాంకు అధికారులతో చర్చించి రుణాలు మంజూరు చేయించాలని స్పష్టం చేసారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎస్ ఎం ఐ శాఖకు రూ.20 కోట్లతో 155 చెక్ డ్యాం పనులు మంజూరు చేసామని నవంబరు నెలాఖరుకు పూర్తి చేయాలని చెప్పారు. నేటికి ప్రారంభం కాని పనులను త్వరతగతిన ప్రారంభించాలని అన్నారు. నీటి సంఘాల సమన్వయంతో చెక్ డ్యాంల పరిధిలో ఉన్న సాగు చేస్తున్న పంటలను పరిశీలించాలని చెప్పారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో సమీపంలో ఉన్న పాఠశాలల నుండి సర్దుబాటు చేయడం జరిగిందన్నారు. సర్దుబాటు చేసిన ఉపాధ్యాయలు పాఠశాలలకు హాజరవుతున్నది, లేనిది ఎటిడబ్ల్యూ ఓలు పరిశీలించాన్నారు. గంజాయి వినియోగం వలన కలిగే నష్టాలను విద్యార్ధులకు వివరించాలన్నారు. శిధిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను గుర్తించి ఐటిడి ఏ పి ఓలకు నివేదించాలన్నారు.
హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించి తగిన పోషకాహారం, ఔషదాలను అందించాలన్నారు. బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలని ఆదేశించారు. పాఠశాలలో 98 శాతం అటెండెన్సు ఉండాలన్నారు. స్థానికంగా సీట్లు ఖాళీలు లేకపోతే సమీపంలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్ధులను చేర్పించాలని పేర్కొన్నారు. పాఠశాలలు భద్రతా ఆడిట్ వేగంగా పూర్తి చేయాలని ఎం ఇ ఓలను ఆదేశించారు. సచివాలయాల పరిధిలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని అన్నారు. తల్లికి వందనం సంబంధించి ఈకెవైసి పూర్తి చేసి లబ్దిదారులకు తల్లికి వందనం అందించాలన్నారు. మార్గదర్శి రిజిస్ట్రేషన్ అర్హులైన బంగారు కుటుంబాలన్నింటిని నమోదు చేయాలని అన్నారు. తాగునీటి పనరులను క్లోరినేషన్ చేయాలని, దోమల మందు పిచికారీ పనులు సక్రమంగా పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ వేతన దారులకు కనీస వేతనాలు అందించే విధంగా పనులు చేయించాలన్నారు. పెంచాలని చెప్పారు. పనిదినాలు
ఈ సమావేశంలో రంపచోడవరం ఐటిడి ఏ పి ఓ కె. సింహాచలం, డి ఆర్ డి ఏ పిడి వి. మురళి, గిరిజన సంక్షేమ శాఖ ఇంచార్జి డిడి క్రాంతి కుమార్, డి ఓ ఓ పి. బ్రహ్మాజీ రావు, జిల్లా పంచాయతీ అధికారి కె.పి. చంద్ర శేఖర్, డ్వామా పి.డి. డా. విద్యాసాగర్, ఎస్ ఎం ఐ డి. ఇ .నాగేశ్వరరావు, గ్రామ వార్డు సచివాలయం నోడల్ అధికారి పి. ఎస్. కుమార్, 22 మండలాల ఎటిడబ్ల్యూ ఓలు, ఎం. ఇ. ఓలు, ఎంపిడి ఓలు, ఉపాధి హామీ ఎపి ఓలు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 Comments