భారీ వర్షాలకు కుంగిపోయిన రహదారి- ప్రయాణికుల కష్టాలు__కడశిల్ప - కొత్తపాలెం రహదారి దుస్థితిపై స్థానిక ప్రజల ఆందోళన

భారీ వర్షాలకు కుంగిపోయిన రహదారి 
ప్రయాణికుల కష్టాలు

కడశిల్ప - కొత్తపాలెం రహదారి దుస్థితిపై స్థానిక ప్రజల ఆందోళన 

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 18(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయితీలోని కడశిల్ప గ్రామ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. రోడ్డుపై ఏర్పడిన పెద్దపెద్ద గుంతల వల్ల ప్రయాణం నరకప్రాయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు మీదుగా ప్రయాణం అంటేనే గుండెల్లో దడ పుడుతోందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ముఖ్యంగా అత్యవసర పనుల మీద వెళ్లేవారు, విద్యార్థులు, గర్భిణీ స్త్రీలకు ఈ రోడ్డు మరింత ఇబ్బందిగా మారింది. గ్రామంలోకి నిత్యావసరాలు, వైద్య సేవలు అందించే వాహనాలు కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఈ రోడ్డు మార్గం దెబ్బతినడం వల్ల రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి, త్వరగా రోడ్డు మరమ్మతులు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Post a Comment

0 Comments