ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్
పాడేరు, ఆగష్టు 12 (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): సహజ మరణానికి ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్.
చింతపల్లి మండలానికి చెందిన గోకాడ నాగరాజు గత సంవత్సరం మర్చి 24న సహజ మరణం పొందిన వారికి కుమారులైన గోకాడ చరణ్ తేజాకి మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో పియమ్ జెజెవై కేంద్ర ప్రభుత్వం భీమా రూ. 2 లక్షల చెక్కును అందజేశారు.
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జనని సురక్షా క్యాంపైన్ జూలై 1 నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జిల్లా వారీగా 430 గ్రామ పంచాయతీల్లో అవగాహనా సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ఎల్ డి యమ్ మూతునాయుడు అన్నారు. గోకాడ చరణ్ మాట్లాడుతూ తన తండ్రి మరణించిన వెంటనే యూనియన్ బ్యాంకు వారు సత్వరం స్పందించారని, జిల్లా కలెక్టర్, ఎల్డియమ్, యూనియన్ బ్యాంకు వారి సహకారంతో భీమా చెక్ అందిందన్నారు.
చెక్కు పంపిణిలో చింతపల్లి యూనియన్ బ్యాంకు మేనేజర్ గౌతమ్ కుమార్ ఉన్నారు.
0 Comments