పాడేరులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన

పాడేరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన.
వంజంగిలోని వనదేవత మోదకొండమ్మను దర్శించుకున్న సీఎం.
సమీపంలోని కాఫీ ప్లాంటేషన్లోని తోటలను పరిశీలించిన ముఖ్యమంత్రి.
కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో మాట్లాడిన చంద్రబాబు.
ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ తోటల పెంపకంలో ఇబ్బందులేమైనా ఉన్నాయా అంటూ చంద్రబాబు ఆరా.

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద గిరిజన ప్రాంతంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు...ప్రారంభోత్సవాలు చేపట్టిన సీఎం.
ప్రజా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన చంద్రబాబు.

గిరిజన ప్రాంతాల్లో హోం స్టే ప్రాజెక్టులు ఎలా ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్న చంద్రబాబు.

ప్రకృతిని ఎంజాయ్ చేసేలా ఆరోగ్యకరమైన వాతావరణంలో హోం స్టే ఉండేలా చూసుకోవాలన్న సీఎం.
గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.

ఉత్పత్తుల విక్రయాలు ఎలా ఉన్నాయని ఆరా తీసిన ముఖ్యమంత్రి

గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ కలిగేలా చూడాలన్న సీఎం.

గిరిజన ఉత్పత్తులకు సంబంధించి మరింత మార్కెటింగ్ వచ్చేలా ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం కల్పించేలా చేసే అంశంపై ఆలోచన చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి.
ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు మరింత ప్రొత్సహమివ్వాలని చంద్రబాబు సూచన.

ఈ-కామర్స్ వేదికల మీద ఆర్గానిక్ ఉత్పత్తులు, గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా చూడాలని సీఎం ఆదేశం.

గంజాయి సాగు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగిన చంద్రబాబు.

డ్రోన్ల వినియోగం ద్వారా గంజాయి సాగును నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారా..? అడిగిన సీఎం.

త్వరలోనే జీరో గంజా ప్రాంతంగా ప్రకటిస్తామని చెప్పిన అధికారులు.

గంజాయి సాగును, వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకుంటే.. టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పిన సీఎం.

జీరో గంజా కల్టివేషన్, జీరో క్రైమ్ దిశగా పోలీసులు ప్రణాళికాబద్దంగా పని చేయాలని సీఎం ఆదేశం.

ఏజెన్సీ ప్రాంతంలో సెరీకల్చర్ సాగును 10 వేల ఎకరాల్లో చేపడుతున్నట్టు వివరించిన అధికారులు.

సెరీకల్చర్ ద్వారా వచ్చిన పట్టుదారాలతో నేసిన వస్త్రాలను పరిశీలించిన ముఖ్యమంత్రి.

నిఫ్ట్ వంటి సంస్థలతో కలిసి పని చేయడం ద్వారా ఏజెన్సీలో నేసిన వస్త్రాలకు మంచి డిమాండ్ వచ్చేలా చేయవచ్చని సీఎం సూచన.

ఏజెన్సీలో నేసిన వస్త్రాల మార్కెటింగ్ కోసం మంచి భాగస్వాములను అన్వేషించాలని సీఎం ఆదేశం.

ఏజెన్సీలో నేసిన ఓ చీరను కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి.

స్టాల్లో డ్వాక్రా మహిళ ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టార్ సందర్శింటచి, కాఫీ సేవించిన సీఎం చంద్రబాబు.

ఆదాయం ఎంత వస్తుందని అడిగిన ముఖ్యమంత్రి.

కూకీస్, మిల్లెట్ బిస్కట్లు, స్థానికంగా లభించే ముడిసరుకునే ఉపయోగించి చాక్లెట్లను తయారీ మీద కూడా దృష్టి సారించాలన్న చంద్రబాబు.

Post a Comment

0 Comments