గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం__జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ

గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం
జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ

అల్లూరి జిల్లా, పాడేరు, ఆగష్టు 21(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): ట్రైపాడ్ ద్వారా గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అన్నారు.
గురువారం నాడు వెలుగు జిల్లా సమాఖ్యకేంద్రంలో సంబంధిత అధికారులతో వందన్ వికాస్ కేంద్రల  గిరిజన సభ్యులు వారి ఉత్పత్తులకు సంబంధించి ప్రదర్శన ప్రారంభించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ప్రదర్శన తిలకించి మాట్లాడుతూ  వందన్ వికాస్ కేంద్రాల  సభ్యులు గిరిజన ఉత్పత్తులను ఎంప్యానల్మేంట్  చేసుకోవాలని  దేశంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన స్టోర్స్ లలో అమ్మకాలు చేయబడతాయని, మరింత ఎక్కువ ఉత్పత్తులు అందజేయాలని, ప్యాకింగ్, బ్రాండింగ్  పై ట్రైపాడ్ శిక్షణ అందజేయడం జరుగుతుందని, తద్వారా  గిరిజనులు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రైపాడ్ రీజనల్ మేనేజర్ సందీప్ శర్మ, మార్కెటింగ్ మేనేజర్ రమేష్, వెలుగు అడ్మిన్ అసిస్టెంట్ కె. అప్పారావు, వందన్ వికాస్ కేంద్ర సభ్యులు తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments