భూములు రీసర్వే మ్యుటేషన్లు జాప్యం చేస్తే చర్యలు తప్పవు
జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ
అల్లూరి జిల్లా, పాడేరు ఆగస్టు 19(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): భూములు రీ సర్వే, ముటేష్ల ప్రక్రియలో జాప్యం చేస్తే రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి 22 మండలాల తాహశీల్దారులు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మ్యుటేషన్లు, ఆధార్ సంబంధిత సమస్యలు, అన్నదాత సుఖీభవ డేటా సమస్యలు, రీసర్వే పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ పరమైన సమస్యలను వారం రోజుల్లో పూర్తి చేయమని గత వారం చెప్పిన నేటికి పూర్తి చేయలేదని పనితీరు ఇలాగే ఉంటే తాహశీల్దారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వి ఆర్ ఓ, విలేజ్ సర్వేయర్లు తాహశీల్దారుల మాట వినక పోతే మెసేజ్ చేయండి వెంటనే సస్పెండ్ చేస్తామని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది, సర్వే సిబ్బందితో రెగ్యులర్గా సమీక్షలు నిర్వహించాలని తాహశీల్దారుకు సూచించారు. రీ సర్వే డేటా ఈనెలాఖరు నాటికి తాహశీల్దారు లాగిన్ నుండి సబ్ కలెక్టర్ లాగిన్కి పంపించాలని చెప్పారు. ఈనెల 31వ తేదీలోగా 108 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. హౌన్ సైట్ పట్టాలు రీ పెరిఫికేషన్ చేయాలన్నారు. ఎటపాక, కూనవరం, చింతూరు వి ఆర్ పురం మండలాల్లో హౌస్ సైట్ పట్టాలు వెరిఫికేషన్ సక్రమంగా చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. అన్నదాత సుఖీ భవ సమస్యలు పరిష్కారానికి అత్యంత ప్రాధన్యత ఇవ్వాలన్నారు. జలపాతాలకు పర్యాటకులను అనుమతించ వద్దన్నారు. కంట్రోల్ రూంలు సక్రమంగా పని చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చింతూరు డివిజన్ లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారని అన్నారు. అవరమైన చోట సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, చింతూరు సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ సర్వే సహాయ సంచాలకులు దేవేంద్రుడు, 22 మండలాల తాహశీల్దారులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
0 Comments