ఉద్యోగ సంఘం నేతల సేవా కార్యక్రమాలు

ఉద్యోగ సంఘం నేతల సేవా కార్యక్రమాలు 

పుస్తకాలు, రాతసామగ్రి అందజేసిన ఏపీజీఈఏ తాలూకా నాయకులు

చింతపల్లి, ఆగస్టు 5 (సురేష్ కుమార్ పాడేరు స్టాఫ్ రిపోర్టర్): గిరిజన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) చింతపల్లి తాలూకా ప్రధాన కార్యదర్శి అనిమిరెడ్డి శంకరరావు అన్నారు. మంగళ వారం ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ జన్మదినంను పురస్కరించుకుని నాయకులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపణీ చేశారు. వాముగెడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, రాత సామగ్రి అందజేశారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తాలూకా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సూర్యనారాయణ ఉద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సంజయ్ కుమార్, గసాడి పద్మనాభం, హెచ్ఎం సింహాచలం, ఏవో మధుసూదనరావు, శోభన్ బాబు, ఏపీసీపీఎస్ఈఏ జిల్లా నేత కుడుముల వెంకట రమణ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments