ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి- పలు చోట్ల పిడుగులు పడే అవకాశం__కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు__హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసిన వెంటనే తక్షణ సహాయం___జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
పలు చోట్ల పిడుగులు పడే అవకాశం

కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు

హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసిన వెంటనే తక్షణ సహాయం

జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్

పాడేరు, ఆగస్టు 18(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): వర్షాల వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ సూచించారు. ఏపీ విపత్తుల సంస్థ సూచనల మేరకు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదన్నారు. సురక్షితమైన భవనాల్లో ప్రతి ఒక్కరూ ఆశ్రయం పొందాలని, వర్షాల వేళ అందరూ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

గోదావరి, శబరి ఫ్లడ్స్, హెవీ రైన్స్ కారణంగా ఎటువంటి విపత్తు సంభవించినా వెంటనే ఐటిడిఎ చింతూరు, సబ్ కలెక్టర్ ఆఫీస్ చింతూరులో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసిన వెంటనే తక్షణ సహాయం అందజేయడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.

ఐటిడిఎ చింతూరు, హెల్ప్ లైన్ సెల్ నంబర్లు 8121729228 / 9490026397

లేండ్ లైన్ నెంబర్ 08864 299936

సబ్ కలెక్టర్ ఆఫీస్ చింతూరు, హెల్ప్ లైన్ సెల్ నంబర్లు 8121729228 / 9490026397

లేండ్ లైన్ నెంబర్ 08864299936

Post a Comment

0 Comments