అభివృద్దే లక్ష్యంగా ప్రజా నాయకుడు బొమ్మిడి నాయకర్
జనసేన పార్టీ బలోపేతానికి ఆయన కృషి ఎనలేనిది
జనసేన పార్టీ ఐటి టీమ్ కో-ఆర్డినేటర్ అనిల్ కుమార్
అల్లూరి జిల్లా, పాడేరు ఆగస్టు 19 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : తన ప్రాంత ప్రజల అభివృద్ధి ధ్యేయంగా, జనసేన బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజా నాయకుడు బొమ్మిడి నాయకర్ అని జనసేన పార్టీ ఐటి టీమ్ కో-ఆర్డినేటర్ సిహెచ్ అనిల్ కుమార్ అన్నారు. జనసేన పార్టీలో ఆయన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వ విప్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ను వారి స్వగృహమునందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీలో బొమ్మిడి నాయకర్ సేవలు అమూల్యమైనవన్నారు. ఎమ్మెల్యే గా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సమస్యల పరిష్కారానికి వినతులు స్వీకరిస్తూ నర్సాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నాయకునికి సత్కరించడం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. జనసేన పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించి కృషి చేస్తున్న నాయకులు, కూటమి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అని కొనియాడారు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలకు తెలియజేస్తూ పచ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీని కంచుకోటల నిలబెడుతున్న బొమ్మిడి నాయకర్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.. నిరంతరం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం నిలబడే వారికి అండగా నిలబడి ప్రోత్సహిస్తూనే ఉండాలని జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. బొమ్మిడి నాయకర్ లాంటి నాయకులు జనసేన పార్టీలో ఉండడం అదృష్టంగా భావించాలని జనసేన శ్రేణులకు తెలియజేశారు. మీరు మరెన్నో పదవులు చేపట్టాలని, జనసేన పార్టీలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన చర్యలు, పార్టీ విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments