సులభతరమైన టెక్నాలజీ వినియోగించు కోవాలి- ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి- జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్

సులభతరమైన టెక్నాలజీ వినియోగించు కోవాలి
ప్రతీ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్

పాడేరు, ఆగష్టు 12 (సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): సులభతరమైన టెక్నాలజీ వినియోగించు కోవాలి, ప్రతీ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ అన్నారు.

సమగ్ర శిక్ష ఆధ్వర్యం లో హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్  భారత్  కార్యక్రమంలో భాగంగా స్కూలింగ్ బిల్డింగ్ బ్లాక్స్ అండర్ ది ఓవరాచింగ్ థెం పై జిల్లా స్థాయి వర్కుషాప్ మంగళవారం జిల్లా కలెక్టరెట్ సమావేశం మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 
శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన విద్యా వ్యవస్థ 2047 నాటికి ఎలా ఉండాలి అన్న దానిపై ఈ శిక్షణా కార్యక్రమం అన్నారు. 2047లో విద్యా విధానం తీసుకోని రావాలి అన్న అంశాలపై ఐసిడిఎస్, సర్వ శిక్ష, విద్యా శాఖా ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు.  ఉన్న అవకాశాలను అందరు సద్వినియోగం చేసుకోవాలి, విద్యార్థి లక్ష్యన్ని పరిధిలోకి తీసుకోని వారికి విద్యా బోధన చేయాలన్నారు. అలాగే రానున్న 2047 నాటికీ అనగాన్వాడిలో మార్పులపై పలు సూచనలు ఇచ్చారు. ఉపాధ్యాయు చేయలేనిది ఏమి లేదన్నారు. విద్యార్థులను తీర్చిదిదే భాద్యత ఉపాధ్యాయునిదే అన్నారు.  సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు 4నెలలు శిక్షణా కార్యక్రమాలు చేపట్టానున్నట్లు తెలిపారు. 2028 నాటికీ పిల్లల్లో స్కిల్ పెంచే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పాఠశాలల భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, అలాగే వారికి పౌష్టిక ఆహారం అందజేయాలన్నారు. డ్రాప్ ఔట్లులేకుండా ఉండేందుకు మంచి వాతావరణం, సౌకర్యాలు కల్పించాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సామాన్వయ బాగస్వామ్యం అవసరం అన్నారు. సులభతరమైన టెక్నాలజీ వినియోగించు కోవాలి అందుకు కావలసిన సూచనలు చేయాలన్నారు.

విద్యా అంటే పాఠశాల కాదు ఉపాధ్యాయులే ఎందుకంటె విద్యార్థిలో మోటివేషన్  చేయడానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. 
ఈ ఒక్క రోజు శిక్షణా కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పి బ్రాహ్మజీ, సర్వ శిక్ష ఎపిసి స్వామినాయుడు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి ఝాన్సీ రామ్ పడాల్, ట్రైబల్ వెల్ఫేర్ ఉపసంచాలకులు   క్రాంతి, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు ఏ ఐ కోఆర్డినేటర్- భాస్కరరావు, సి ఎం ఓ - జ్ఞాన ప్రకాశ్, ఆల్టర్ నెట్ స్కూల్ కో ఆర్డినేటర్ కుర్మారావు, మండల విద్యాశాఖధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments