పేద పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ప్రవేశాలకు మరొక సారి అవకాశం- సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి డా.వి.ఏ.స్వామి నాయుడు

పేద పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ప్రవేశాలకు మరొక సారి అవకాశం
సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి  డా.వి.ఏ.స్వామి నాయుడు

పాడేరు, ఆగష్టు 13(సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): విద్యా హక్కు చట్టం ప్రకారం పైవేటు పాఠశాలలో పేద ప్రతికూల పరిస్థితులలో ఉన్న పిల్లలకు ఒకటో తరగతి లో 25 శాతం సీట్లు కేటాయింపు పై రాష్ట్ర ప్రభుత్వం గతం లో ఉత్తర్వులు జారీ చేసింది. అయిదేళ్ళు నిండిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులు దీని కోసం ఏప్రిల్ 28 నుండి మే 15, 2025 లోపు దరఖాస్తు చేసుకుని, అడ్మిషన్ కూడా పొంది ఉన్నారు. మిగిలిన సీట్ల కు గాను మరల అడ్మిషన్ పొందేందుకు వీలుగా ప్రభుత్వం మరొక సారి అవకాశం కల్పించి, అర్హులైన విద్యార్దుల నుండి దరఖాస్తులను స్వీకరించుటకు ప్రకటన విడుదల చేసిందని అల్లూరి జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి  డా.వి.ఏ.స్వామి నాయుడు తెలిపారు. 2025 – 26 విద్యా సంవత్సరంలో అన్ని ప్రైవేట్, అన్ అయిడేడ్ పాఠశాలకు ఇది వర్తిస్తుంది. అయిదేళ్ళు నిండిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులు దీని కోసం ఆగస్ట్  12 నుండి ఆగష్టు 20, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

దరఖాస్తు ఎలా ?

www.cse.ap.gov.in వెబ్సైటు లో దరఖాస్తు చేసుకోవాలి  తల్లిదండ్రులు తమ ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, జాబ్ కార్డు, విద్యుత్ బిల్లులలో ఏదోకటి, పిల్లల పుట్టిన దృవపత్రం సమర్పించాలి. 2025 మార్చి 31 నాటికి అయిదేళ్ళు పూర్తి అయ్యి ఉండాలి. 

ఫలితాలు ?

లాటరి ద్వారా మొదటి దప ఫలితాలు : 25 ఆగస్ట్ 2025 న వెల్లడిస్తారు. ఎంపిక కాబడిన పిల్లలకు పాఠశాలల ద్వారా ప్రవేశాల నిర్దారణ తేది : 31 ఆగస్ట్ 2025 న ఉంటుంది.

ఎవరు అర్హులు ?

ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలు (అనాధలు, H.I.V బాదితుల పిల్లలు, దివ్యంగులు ఎస్సి, ఎస్టి వర్గాలు  ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలు (మైనార్టీలు , బి సి లు , ఓ సి లు – గ్రామీణ ప్రాంత కుటుంభాలకు సంవత్సర ఆదాయం రూ . 1,20,000 /-  మరియు పట్టణ ప్రాంతం కుటుంబాలకు సంవత్సర ఆదాయం రూ. 1,44,000/- లోబడిన కుటుంబాల పిల్లలకు )
ఏయే పాఠశాలలలో  చేర్పించవచు ? CBSE/ICSE/IB/State సిలబస్ బొదిస్తున్న అన్ని ప్రైవేట్, అన్ అయిడేడ్ పాఠశాలు అర్హులైన పిల్లలందరినీ బడులలో చేరుద్దాం.

“అయిదేళ్ళు నిండిన అర్హులైన  పిల్లలు అందరిని తప్పక ఈ పదకం లో చేర్చేలా మండల స్తాయి అధికారులు కృషి చెయ్యాలి. తద్వారా అన్ని ప్రైవేట్, అన్ అయిడేడ్ పాఠశాలలలో పేద , బలహీన వర్గ కుటుంబాలకు తగిన చేయూత నిచ్చినవారమవుతాం.”

Post a Comment

0 Comments