తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం

తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం

చింతపల్లి అంగన్వాడి సెక్టార్ సూపర్వైజర్ డి విజయ భారతి 
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 5 : (సురేష్ కుమార్ పాడేరు స్టాప్ రిపోర్టర్) 
తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారమని, ఇది బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుందని చింతపల్లి అంగన్వాడి సెక్టార్ సూపర్వైజర్ డి విజయ భారతి అన్నారు. ఆగస్టు 1 నుండి 7 వరకు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాలలో భాగంగా మండల కేంద్రం లోని రెండు అంగన్వాడీ కేంద్రాల్లో విజయభారతి ఆధ్వర్యంలో వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా తల్లి పాల ప్రాముఖ్యత గురించి గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజయభారతి మాట్లాడుతూ తల్లి పాలు శిశువుకు తొలి ఆరు నెలలు కావాల్సిన అన్ని పోషకాలను అందిస్తాయని, రోగనిరోధక శక్తిని పెంచుతాయని, అలాగే శిశువు మెదడు, శరీరం ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడతాయని తెలిపారు. తల్లిపాలు తాగే పిల్లలు ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువని, తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయని వివరించారు. ఈ వారోత్సవాల ద్వారా తల్లిపాలు బిడ్డకు ఇచ్చే ప్రాముఖ్యతను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ ఎన్. అరుణకుమారి, స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, మరియు ఇతర తల్లులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments