సిపిఐ పార్టీ అల్లూరి జిల్లా మహాసభను జయప్రదం చేయండి

సిపిఐ పార్టీ అల్లూరి జిల్లా మహాసభను జయప్రదం చేయండి
నాయకులతో కలిసి మహాసభ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న విష్ణుమూర్తి

సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు విష్ణుమూర్తి

అల్లూరి జిల్లా, చింతపల్లి, ఆగస్టు 7(సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్) : ఈనెల 16, 17  తేదీలలో రంపచోడవరంలో జరగబోయే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా మహాసభ ను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుంకరి విష్ణుమూర్తి అన్నారు. జిల్లా మహాసభను జయప్రదం చేయాలనే సంకల్పంతో ఆ పార్టీ చింతపల్లి మండల కార్యదర్శి పేట్ల పోతురాజు ఆధ్వర్యంలో గురువారం చింతపల్లిలో సమావేశమైన ఆ పార్టీ కీలక నేతల ఆధ్వర్యంలో మహాసభ పోస్టర్ ను పార్టీ నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంలో సిపిఐ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మహాసభలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16, 17 తేదీలలో రంపచోడవరంలో నిర్వహించ తలపెట్టిన జిల్లా మహాసభలకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ మహాసభకు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎర్రబొమ్మల పంచాయతీ ఎంపీటీసీ సభ్యుడు ఎస్ సత్తిబాబు, జిల్లా సమితి సభ్యులు షేక్ రెహమాన్ (బుజ్జి), సీనియర్ నాయకుడు గెమ్మెలి కుజ్జన్న, పి చిన్నారావు, జీకే వీధి మండల కార్యదర్శి కిలో భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments