ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వతంత్రం వేడుకలు..
 అల్లూరి జిల్లా, పాడేరు ఆగస్టు 15 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహాయక కలెక్టర్ సాహిత్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమంది దేశభక్తులు మహానుభావులు దేశం కోసం పోరాడి స్వతంత్రాన్ని సాధించారని వారి స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. మన ప్రాంతం నుండి అల్లూరి సీతారామరాజు అనుచరులు అనేకమంది స్వతంత్రం కోసం పోరాడి అమరులయ్యారని అన్నారు. వారి స్ఫూర్తితో మనమందరం దేశభక్తిని చాటుకోవాలని అన్నారు. ప్రపంచ దేశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఏజెన్సీలో రెడ్ క్రాస్ సొసైటీ మరింత విస్తృతం చేసి గిరిజనులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. మూగ చెవిటి వారికి ఉపాధి కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీని మరింత అభివృద్ధి చేసి అనేక మందికి సేవలు అందించాలని అన్నారు. పెరేడ్ మైదానంలో రెడ్ క్రాస్ యూత్ స్కౌత్ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ గంగరాజు కార్యదర్శి గౌరీ శంకర్ కోశాధికారి సూర్యారావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్రా నాగరాజు జిల్లా కార్యవర్గ సభ్యులు జయలక్ష్మి, సుబ్రహ్మణ్యం, లోహితస్, మరల మని చెవిటి మూగ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments