మైనర్ల డ్రైవింగ్ కు ప్రోత్సహిస్తే వారితోపాటు యజమానులకు కేసులు తప్పవు- చింతపల్లి ఎస్సై వెంకటేశ్వరరావు

మైనర్ల డ్రైవింగ్ కు ప్రోత్సహిస్తే వారితోపాటు యజమానులకు కేసులు తప్పవు
వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

చింతపల్లి ఎస్సై వెంకటేశ్వరరావు

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 16 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని, మైనర్లు వాహనాల డ్రైవింగ్ ను సహించబోమని చింతపల్లి ఎస్సై వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం చింతపల్లి మండల కేంద్రంలో వాహనాల ప్రత్యేక తనిఖీలలో భాగంగా యువతకు ట్రాఫిక్ నియమాలు, డ్రైవింగ్ పై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండి చట్టబద్ధమైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ పత్రాలు, కాలుష్య ధృవీకరణ పత్రం, హెల్మెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని, అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ కి ప్రోత్సహించిన, మైనర్లకు వాహనాలు ఇచ్చిన వాహన యజమానులపై కూడా జరిమానాలతోపాటు కేసులు విధించబడతాయని హెచ్చరించారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలు ఒకే కుటుంబాన్ని దెబ్బతీసే స్థాయిలో తీవ్ర విషాదాలకు కారణమవుతున్నాయని గుర్తు చేశారు. ప్రాణాలను పణంగా పెట్టే బదులు నియమాలను పాటించి, సురక్షితంగా వాహనాలను నడపాలని ఆయన యువతను కోరారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు చేసి, అవగాహన పత్రికలు పంపిణీ చేశారు. ప్రత్యేక తనిఖీల్లో ఏఎస్ఐలు ధనుంజయ్, నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments