దేశం కోసం తొలి ప్రాణత్యాగం ఆదివాసిదే - చరిత్రలో లిఖించని ఆదివాసి స్వాతంత్ర సమరయోధుడు బాబా తిల్కా మాంజీ

దేశం కోసం తొలి ప్రాణత్యాగం ఆదివాసీదే 
బాబా తిల్కా మాంఝీ

ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజబాబు 

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 16 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): భారత దేశ స్వాతంత్ర్యం కోసం తొలుత ప్రాణ త్యాగం చేసింది ఆదివాసీ అయినా బాబా తిల్కా మాంఝీ అని, కానీ చరిత్రలో ఆ విషయం చెప్పడం లేదని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 1600వ సంవత్సరంలో వ్యాపారం కోసం భారత దేశంలోకి  వచ్చిన బ్రిటీష్ వారు దేశాన్ని హస్తగతం చేసుకొని పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో మొట్టమొదట బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా 1784లో  బాబా తిల్కా మాంఝీ పోరాడి బ్రిటీష్ ప్రభుత్వం చేత ఉరి తీయబడ్డాడనీ, కానీ చరిత్రలో ఈ విషయాన్ని చెప్పడం లేదని అన్నారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో మంగళపాండే కన్నా 73 సంవత్సరాల ముందే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన బాబా తిల్కా మాంఝీ 1750 ఫిబ్రవరి 11 న ఉమ్మడి బీహార్ రాష్ట్రంలో గల సుల్తాంగంజ్ లో జన్మించారని, 1770లో విపరీతమైన కరువు కారణంగా మరియు విలియం పిట్ ది యంగర్ చేత ప్రభావితమైనా కోర్టు ఆఫ్ డైరెక్టర్స్ ఆదేశాలు అనుసారంగా కోర్టు ఆఫ్ డైరెక్టర్ జమీందారుకి పదేళ్లు  సెటిల్మెంట్ 1800 జారీ చేసింది. దాంతో స్థానిక జమీందార్లు మరియు సంతాలు గ్రామస్తుల మధ్య చర్చలు జరిపేందుకు అవకాశం దక్కింది. బాబా తిల్కా మాంఝీ అగస్టాన్ క్లీన్ ల్యాండ్  బ్రిటీష్ కమీషనర్ (లెఫ్ట్ నెంట్) మరియు రాజ్ మహాల్ పై గలేల్ అనే ఆయుధంతో దాడి చేయగా అతను చనిపోయాడని, బ్రిటీష్ వారు బాబా తిల్కా మాంఝీ నిర్వహించే తిలాపూర్ అడివిని చుట్టుముట్టారని, చాలా వారాలపాటు తిల్కా మనుషులు బ్రిటిష్ వారికి దొరకకుండా తిరిగారని, చివరకు 1784లో పట్టుబడగా, బాబా తిల్కా మాంఝీని గుర్రపు తోకకు కట్టి బగల్పూర్  కలెక్టర్ నివాసానికి ఈడ్చుకెళ్ళి అక్కడ ఉన్న మర్రి చెట్టుకు అతని మృతదేహాన్ని వేలాడుదీసారని వివరించారు. స్వాతంత్ర్యం అనంతరం బాబా తిల్కా మాంఝీనీ ఉరితీసిన ప్రదేశంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి, బగల్పూర్ గ్రామానికి ఆయన పేరు పెట్టడం జరిగిందని, బగల్పూర్ విశ్వ విద్యాలయానికి ఆయన పేరుతో తిల్కా మాంఝీ బగల్పూర్ విశ్వ విద్యాలయం అని పేరు మార్చారని, అలాగే రాజ్యాంగ రచన కమిటీలో సభ్యుడు మరియు 5, 6 వ షెడ్యూల్డ్ రూపశిల్పి అయినా జైపాల్ సింగ్ ముండా పేరుని కూడా ఎక్కడ ప్రస్తావించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి బిడ్డలంతా ఆదివాసి చరిత్ర ఖచ్చితంగా తెలుసుకోవాలని అభిప్రాయపడ్డారు.

Post a Comment

0 Comments