స్త్రీ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్
పాడేరు ఆగస్టు 15(సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్):
స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ అన్నారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించిందని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపోలో పాడేరు , అరకు వ్యాలీ ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయనగరం రీజన్ ఆర్టీసీ చైర్మన్ దోన్ను దొర, జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరిలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడలో ప్రారంభించారని చెప్పారు. మహిళలందరూ ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని చెప్పారు. ఆర్టీసీ బస్సులు మహిళలు గిరిజన ఉత్పత్తులను రవాణా చేసుకోవచ్చని అన్నారు.
ఆర్టీసీ చైర్మన్ దొన్ను దొర మాట్లాడుతూ మహిళలకు ఉచిత పసుపు పథకం ఆర్థిక తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. విజయనగరం ఆర్టీసీ రీజన్లో 1779 బస్సులు ఉండగా ఉచిత ప్రయాణాలకు 13 52 బస్సులను కేటాయించమని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు గిరిజన మహిళల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డు లేదా వాటర్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించాలని అన్నారు. ముంచంగి పుట్టు మండలం కుమడ _ బూసిపుట్టు సర్వీస్ బస్సును ప్రారంభించారు.
ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఆర్టీసీ అధికారులు పక్కగా అమలు చేయాలని చెప్పారు. షరతులతో అర్హతగల ఉత్పత్తులలో (పాలేవెలగు, అల్ట్రా పల్లెవెలగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ మరియు ఎక్స్‌ప్రెస్) అన్ని ఘాట్ రూట్ సేవల్లో స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయాలని సూచించారు:
ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్ భాగంలో నిలబడి ఉన్న ప్రయాణీకులను అనుమతించకూడదు.
ప్రయాణీకుల భద్రత పట్ల అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి.
సప్తగిరి ఎక్స్‌ప్రెస్ మరియు గ్రీన్ సప్తగిరి బస్సులలో స్ట్రీ శక్తి పథకం వర్తించదని కూడా దీని ద్వారా పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్ జానపద కళాకారుల చైర్మన్ వంపూరి గంగులయ్య, జిసిసి డైరెక్టర్ బొర్రా నాగరాజు, ట్రై కార్ డైరెక్టర్ కృష్ణారావు, ఆర్టీసీ డిఎం టి ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 Comments