అల్లూరి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి - పెందుర్తి శాసనసభ్యులు, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు

అల్లూరి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి 
పెందుర్తి శాసనసభ్యులు, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన అధ్యక్షులు రమేష్ బాబు 

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 12 (సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): యువత అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని పెందుర్తి శాసనసభ్యులు, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎం విజయభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పసుపులేటి బాలరాజు, జనసేన అరకు పార్లమెంట్ అధ్యక్షులు వంపురు గంగులయ్య, అల్లూరి సీతారామరాజు వారసులలో ఒకరైన ముని ముని మనమడు అల్లూరి రామరాజు లతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, తెల్లవారి ఆగడాలను అరికట్టి, అణగారిన వర్గాల అణచివేతను ఎదుర్కొని, బానిస సంకెళ్ల నుంచి విముక్తిని ప్రసాదించాలనే సంకల్పంతో కొండ కోనల్లో తిరుగుతూ గిరిజనులకు అండగా నిలబడిన అడవి బిడ్డల ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు అని అన్నారు. అటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతంలో అల్లూరి విగ్రహావిష్కరణలో తనను భాగస్వామిగా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అంతేకాకుండా అల్లూరి వారసులలో ఒకరైన వారి మునిమునిమనవడు రామరాజుతో కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించడం హర్షణీయమన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరితో గిరిజన బిడ్డలు ఎందరో పోరాడారని, ఉద్యమాలకు, పోరాటాలకు ఊపిరి పోసిన నేల మన్యంప్రాంతమని అన్నారు. అటువంటి మహనీయుల విగ్రహాలను పెట్టుకోవడమే కాదు, విగ్రహాలను గౌరవించుకోవాలని, వారు చేసిన త్యాగాలు పోరాటాలను స్మరిస్తూ విద్యార్థులు ఆ మహనీయుల ఆశయ సాధనలో నడవాలని అన్నారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు అంటే తనకు ఎంతో గౌరవమని, ఇక్కడివారు స్వాగతం పలికిన తీరు తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన విద్యార్థుల గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులతో పాటు స్థానిక నాయకులతో కలిసి గిరిజన సంప్రదాయ థింసా నృత్యాన్ని ఆడి అందరినీ అలరించారు. అనంతరం విగ్రహావిష్కరణకు తనను ఆహ్వానించిన విగ్రహదాత దూనబోయిన రమణ, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, యాజమాన్యానికి అలాగే తెదేపా, జనసేన, బిజెపి కూటమి పార్టీల నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్లి సీతారాం, మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు, అరకు పాడేరు కోఆర్డినేటర్ చిరంజీవి, తెదేపా సీనియర్ నాయకులు బేతాళుడు, బిజెపి మండల కార్యదర్శి, జనసేన అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కిముడు కృష్ణమూర్తి, వీరేంద్ర, గాజుల శ్రీను, తరుణ్, వాడకానీ వినయ్, కూడ రామకృష్ణ, తదితర నాయకులతోపాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments