రంపచోడవరం, ఆగస్టు 18 :( స్టాఫ్ రిపోర్టర్ సుంకరి ఆనంద్ )
గుర్తేడు మండల కేంద్రంగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సర్పంచ్ గొర్లె దుష్యంతుడు తెలిపారు. సోమవారం సర్పంచ్ పిలుపుమేరకు ఉద్యోగస్తులు గ్రామ ప్రజలు సమావేశం అయ్యారు. తొలుత గుర్తేడు ను మండలం ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి కి ధన్యవాదాలు తెలపడం జరిగినది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..గుర్తేడు పంచాయతీల కి మిగిలిన 4 పంచాయతీల ప్రజలకు గుర్తేడు 5 నుండి 10 కిలోమీటర్ దూరంలోనే ఉంటదని, వై రామవరం మండలం కేంద్రంగా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు పడేవారమన్నారు. డొంకరాయి మండల కేంద్రం నిర్ణయిస్తే 6 రెవెన్యూ గ్రామాలు మాత్రమే ఉన్నాయని, గుర్తేడు నుండి మారేడుమిల్లి మీదుగా సుమారు 150 కిలోమీటర్లు దూరం అవుతుందని, గుర్తేడు, పాతకోట, ధారగడ్డ, కానివాడ మరియు బొడ్డదండి పంచాయితీలకు సంబంధించి సుమారు 53 రెవెన్యూ గ్రామాలలో ఉన్న ప్రజలు అనేక కష్టాలు పడవలసి వస్తుందన్నారు. ప్రస్తుతం నూతన మండల కేంద్రంగా గుర్తేడు అన్నిటికీ దగ్గరగా ఉంటదని, ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. గుర్తేడు మండల కేంద్రం పూర్తి జరిగిన తర్వాత అధికారులు నిత్యం మనకు అందుబాటులో ఉంటారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగినది.
0 Comments