జానపద కళలకు కొత్త ఊపిరి
అకాడమీ చైర్మన్‌గా వంపూరి గంగులయ్య నియామకంపై కూడ రామకృష్ణ హర్షం
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 13(సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): జనసేన పార్టీలో అంకితభావంతో పనిచేసేవారికి ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని మరోసారి రుజువైందని దానికి నిదర్శనంగా జనసేన అరకు పార్లమెంట్, పాడేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డా,, వంపూరి గంగులయ్యను జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్‌గా నియమిస్తూ పార్టీ అరుదైన గౌరవం అందివ్వడమేనని పెదబరడ పంచాయతీకి చెందిన జనసేన నాయకుడు కూడ రామకృష్ణ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ నియామకం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపి, జనసేన సిద్ధాంతాలకు నిలువుటద్దంగా నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా గంగులయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అంటే కేవలం ఒక పార్టీ కాదు, సిద్ధాంతమన్నారు. ఆ సిద్ధాంతంలో అంకితభావం, నిజాయితీ, కష్టపడే తత్వం ఉన్నవారికి తప్పకుండా ఉన్నత స్థానం లభిస్తుందన్నారు. గంగులయ్య నియామకమే దీనికి గొప్ప ఉదాహరణ అని, పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన వారికి గుర్తింపు లభించదు అనే అపోహను ఈ నిర్ణయం చెరిపేసిందని ఆయన పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు వన్ కళ్యాణ్ నాయకత్వంలో నిజమైన కార్యకర్తలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని రామకృష్ణ తెలిపారు. గంగులయ్య నియామకం పార్టీలోని వేలాది మంది కార్యకర్తలకు ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది అన్నారు. పార్టీ కోసం మనం పడుతున్న కష్టం వృథాగా పోదని, మన నాయకుడు మనల్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన గౌరవం ఇస్తారని ఈ నిర్ణయం రుజువు చేసిందని ఆయన పేర్కొన్నారు. గంగులయ్య ఈ పదవిలో ఉంటూ జానపద కళలను ప్రోత్సహించడంతో పాటు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని కూడ రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నియామకం పార్టీలో కష్టానికి దక్కే గౌరవానికి నిదర్శనమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
0 Comments