వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం
వర్షాకాల సమావేశాలపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
అరకు పార్లమెంట్ సభ్యురాలు డా. గుమ్మ తనూజారాణి
అల్లూరి జిల్లా, పాడేరు/అరుకు ఆగస్టు 21 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన సందర్భంగా, ఢిల్లీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉభయ సభల సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జ్, రాజ్యసభ సభ్యులు వై.వి. సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ సమావేశంలో పాల్గొన్న అరకు పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ గుమ్మ తనుజారాణి ఒక ప్రకటనలో మాట్లాడుతూ పార్లమెంటరీ సమావేశాల పర్వం ముగిసినప్పటికీ, వైసిపి పార్టీకి ఇది కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో, అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగడానికి ఈ సమావేశం ఒక ప్రేరణగా నిలిచిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వివిధ బిల్లులు, ముఖ్యంగా భౌగోళిక వారసత్వ ప్రదేశాల పరిరక్షణ మరియు క్రీడలకు సంబంధించిన కొత్త బిల్లులపై సమీక్షించడం జరిగిందని, భవిష్యత్తులో అనుసరించాల్సిన పార్టీ వ్యూహాలపై కూడా చర్చ జరిపినట్లు తెలిపారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ చేపట్టబోయే కార్యాచరణ, భవిష్యత్ స్టాండ్ గురించి సమావేశంలో చర్చించామని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళేందుకు సభ్యులు తీర్మానించుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో ఉభయ సభల సభ్యులు గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్ పిల్లి, వై.ఎస్. అవినాష్ రెడ్డి, మద్దెల గురుమూర్తి సహా పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. వీరితో పాటు వైసీపీ పార్టీ యువనేత మన్యం జగన్ చెట్టి వినయ్, చింతపల్లి ఎంపీపీ అనూష దేవి, మాజీ అల్లూరి జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు, డాక్టర్ వైయస్సార్ టిఎస్ఆర్ సేవ సంస్థ అధ్యక్ష వ్యవస్థాపకులు తడబారికి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments