అల్లూరి సీతారామరాజు జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచర్ పోస్టుల భర్తీ
పాడేరు ఆగస్టు 5: (సురేష్ కుమార్ పాడేరు స్టాఫ్ రిపోర్టర్) అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను గెస్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి (ఒక సంవత్సరం కాలానికి) పనిచేయడానికి అల్లూరి జిల్లాకు చెందిన అర్హత ఉన్న మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఐదు పోస్టులు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) విభాగంలో ఉండగా, ఆరు పోస్టులు క్రాఫ్ట్ టీచర్ (CRT) విభాగంలో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆగస్టు 6, 2025 నుండి ఆగస్టు 10, 2025 వరకు తమ మండల పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపాల్‌కు సమర్పించవచ్చు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 18-42 సంవత్సరాలు కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనుకబడిన కేటగిరీలకు 5 సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగినులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు కలదని జిల్లా అదనపు పథక సమన్వయకర్త డాక్టర్ వి.ఎ. స్వామినాయుడు తెలిపారు. పూర్తి వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం, పాడేరులో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
0 Comments