గిరిజన ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేసిన సీఎం చంద్రబాబు - మాజీ జిసిసి చైర్మన్ ఎంవివి ప్రసాద్

గిరిజన ప్రాంత అభివృద్ధికి పెద్దపీటవేసిన సీఎం చంద్రబాబు
తాజంగి పంచాయతీలో సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎంవీవీ ప్రసాద్

మాజీ జీసీసీ చైర్మన్ ఎంవీవీ ప్రసాద్ 

చింతపల్లి, ఆగస్టు 11(సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): గిరిజన ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీటవేశారని మాజీ జీసీసీ చైర్మన్ ఎంవీవీ ప్రసాద్ అన్నారు. సోమ వారం తాజంగి గ్రామ పంచాయతీ కేంద్రలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ జీసీసీ చైర్మన్ మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి గిరిజన ప్రాంత అభివృద్ధికి తన ప్రణాళికను స్ప ష్టం చేశారన్నారు. ప్రతి గిరిజనుడు ఆర్థికంగా బలపడేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలతులోకి తీసుకొస్తున్నారన్నారు. గిరిజ నులు పండిస్తున్న కాపీకి ఆయన ప్రపంచ స్థాయిలోనే ప్రత్యేక బ్రాండింగ్ తీసుకొచ్చారన్నారు. మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగుకి ఆయన నిధులు కేటాయించారన్నారు. అర్హులందరికీ పక్కా గృహాలు మంజూరు చేశారన్నారు. ప్రతి గిరిజన గ్రామానికి తారు. రోడ్లు, రక్షిత మంచి నీటి పథకాలు నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆదివాసీలకు శత శాతం ఉద్యోగాలు కల్పించేందుకు నాడు జీవో నంబరు-3 తీసుకొచ్చింది చంద్రబాబేనన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఈ జీవోను దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోగా జీవో నంబరు-శి పునరుద్ధరణకు కనీస చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక జీవోను తీసుకొస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారన్నారు. న్యాయస్థానాలు జీవోని రద్దుచేయకుండగా పక్కాగా చట్టబద్ద కల్పిం చేందుకు దర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించడంపై గిరిజనులు వార్తం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికైన వైసీపీ నాయకుల ఆర్థరహిత ఆసత్య ప్రచారాలను విడిచిపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వేరా సత్యనారా యణ దాల్, ముడు లక్ష్మయ్య, శ్యాంసుందర్, పార్వతి, పొంగి రామారావు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments