ఏపీజీఈఏ తాలూక ఆధ్యక్షుడుగా సంజయ్ కుమార్

చింతపల్లి, ఆగస్టు 10 (పాడేరు స్టాఫ్ రిపోర్టర్ పి. సురేష్ కుమార్): తాలూక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) అధ్యక్షుడుగా జి. సంజయ్ కుమార్ ఏకగ్రీ వంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి డీవీఎస్ఎన్ రాజు తెలిపారు. ఆదివారం సబ్ డివిజన్ కేంద్రంలో కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి మండలాల తాలూక ఏపీజేఈఏ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈసంద ర్భంగా తాలూక నూతన కార్యవర్గాన్ని ఉద్యోగులు ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడుతోపాటూ ప్రధాన కా ర్యదర్శిగా ఎ. శంకరరావు. అసోసియేట్ అధ్యక్షుడుగా గసాడి పద్మనాభం. కార్యనిర్వాహక కార్యదర్శిగా పి. సుమసుందర్, ఉపాధ్యక్షులుగా పి. కిశోర్ చంద్ర. టి. మధుసుదనరావు, పి. నానిబాబు, కె. సింహాచలం, సంయుక్త కార్యదర్శిలుగా ఎం. నాగరాజు, వి. శోభన్ బాబు, ఆర్. కన్నబాబు, కె. బాస్కరరావు, ఎస్ఎస్వీవీ ప్రతాప్ కుమార్, జె. పార్వతి, ఎస్. బాయీరావు, కోశాధికారిగా కె. సత్యవతి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గంతో ఎన్నికల అధికారి ప్రమాణం చేయించారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృ షి చేస్తానన్నారు. ఈకార్యక్రమంలో ఏపీజీఈఎస్ విశాఖపట్నం జిల్లా అధ్యకుడు రాజశేఖర్రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు, జిల్లా కార్యదర్శి జగన్మోహన్రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి అజయ్ కుమార్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments