యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి- జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్

యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్

పాడేరు, ఆగస్టు 13 (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని బుధవారం జిల్లా కలెక్టరెట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ ప్రధాన మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం వారి ఆలోచన మేరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో మరియు దేశ స్థాయిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రెండు వారాల పాటు జరుపుకోవాలని తెలియజేశారన్నారు.  ఈ వేడుకల్లో జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని, మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యతని, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఈరోజు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం లో భాగంగా మువ్వన్నెల జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. 

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, సహాయ కలెక్టర్ కె. సాహిత్, డిఇఓ పి.బ్రహ్మజీ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎన్ నంద్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విశ్వేశ్వర నాయుడు, డిఆర్డిఎ పిడి మురళీ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి ఝాన్సీ రామ్ పడాల్ వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments