రాజవొమ్మంగిలో అట్టహాసంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

అట్టహాసంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అల్లూరి జిల్లా, రంపచోడవరం డివిజన్, రాజవొమ్మంగి ఆగస్టు 15 (సుంకరి ఆనంద్ రంపచోడవరం స్టాఫ్ రిపోర్టర్) : రాజవొమ్మంగి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, ఎంపీడీవో లోకుల యాదగిరి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని, వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ దేశ సమగ్రతను, ఔన్నత్యాన్ని కాపాడుతూ జాతీయవాదంతో మెలగాలని, భారతదేశాన్ని ప్రపంచ పటంలో అన్ని రంగాలలో అగ్రస్థానానికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments