ముఖ్యమంత్రి ప‌ర్య‌ట‌న విజ‌య‌వంత‌మ‌య్యేలా ప‌టిష్ట ఏర్పాట్లు

ముఖ్యమంత్రి ప‌ర్య‌ట‌న విజ‌య‌వంత‌మ‌య్యేలా ప‌టిష్ట ఏర్పాట్లు
అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్ 

జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్

అల్లూరి జిల్లా, పాడేరు ఆగష్టు 07 (సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్):  ఈ నెల 09వ తేదీన జ‌రిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించనున్నారని ప‌ర్య‌ట‌నకు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని, స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ అన్నారు.

అల్లూరి జిల్లా పాడేరు మండలం వంజంగి, లగిసపల్లి గ్రామాల్లో ఈనెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా వంజంగి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్, ఎస్పీఅమిత్ బర్దార్ , జెసి అభిషేక్ గౌడ, సీఎం పర్యటన ఏర్పాటు కమిటీ ప్రతినిధులు, స్థానిక జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ , మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సందర్శించి ఏర్పాట్లను వంజంగి గ్రామ మహిళలుతో గిరిజన సంప్రదాయాలు సంబంధించిన పండగలు ప్రదర్శన పై ఏ విధంగా చేయాలనే దానిపై చర్చించారు.గ్రామ సావడి వద్ద గిరిజన సంప్రదాయాల పండగల ప్రదర్శనలో గిరిజన మహిళలతో మమేకమవ్వనున్నారు. అనంతరం సమీపంలో ఉన్న ఓ నివాస గృహంలో హోమ్ స్టే పరిశీలించనున్నారు.  తర్వాత కాపీ తోటలు పరిశీలించి కాపీ రైతులతో ముచ్చటించనున్నారు. అనంతరం లగిసపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని తర్వాత లగిసిపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన సభ వేదికలో కార్యకర్తలు తో సమావేశం నిర్వహిస్తారు. ఈ పర్యటన ఏర్పాట్ల పరిశీలనా కార్యక్రమంలో పాడేరు సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్, సహాయ కలెక్టర్ నిశాంత్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది ఉన్నారు.ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్

Post a Comment

0 Comments