తెదేపా జిల్లా ఇన్చార్జిని మార్చండి - మాజీ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య

తెదేపా పాడేరు నియోజకవర్గ ఇంచార్జిని మార్చండి.
విజ్ఞప్తి చేస్తున్న తెదేపా మాజీ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య.

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 8 (సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్):- తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జిని మార్చాలని ఆ పార్టీ చింతపల్లి మండల మాజీ ఉపాధ్యక్షుడు కిముడు లక్ష్మయ్య అన్నారు. మండలంలోని లంబసింగి  గ్రామంలో తెదేపా చింతపల్లి మండల మాజీ ఉపాధ్యక్షుడు కిముడు లక్ష్మయ్య ఆధ్వర్యం లో శుక్రవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లంబసింగి మాజీ ఎంపిటిసి సభ్యుడు పొత్తూరు రాంబాబుతో కలసి ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న గిడ్డి ఈశ్వరి గత కొన్ని నెలలుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ, తెదేపా నాయకులను, కార్యకర్తలను ఏమాత్రం పట్టించు కోవడం లేదని ఆరోపించారు. నియోజకవర్గం పరిధిలో 5  మండలాలు ఉన్నాయని, ఈ 5 మండలాల్లోని  నాయకులను కార్యకర్తలను గత కొన్ని నెలలుగా ఆమె పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.  ఈ విషయమై తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించి, సమస్యగా ఉన్న తెదేపా నియోజక వర్గ ఇన్చార్జిని తక్షణమే మార్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో తెదేపా నాయకులు టి. రామారావు, బోనంగి బంగారు పడాల్, వీరయ్య దొర, బంగారయ్య, జి వెంకట రమణ, బోనంగి బెన్న లింగేశ్వరరావు, భీమరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments