పరిశుభ్రమైన పంచాయితీగా మార్చేందుకు సహకరించాలి

పరిశుభ్రమైన, స్వచ్ఛమైన పంచాయితీగా మార్చేందుకు సహకరించాలి 
తోపుడు బండిని ప్రారంభిస్తున్న సర్పంచ్

బెన్నవరం సర్పంచ్ సన్యాసమ్మ 

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 7 (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): చింతపల్లి మండలం పరిధిలోని బెన్నవరం పంచాయతీని స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పంచాయతీగా తీర్చిదిద్దేందుకు పంచాయతీ ప్రజలంతా సహకరించాలని సర్పంచ్ బచ్చలి సన్యాసమ్మ అన్నారు. అందులో భాగంగా పంచాయితీలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆధ్వర్యంలో తెదేపా తెలుగు యువత మండల అధ్యక్షుడు పూజారి నారాయణమూర్తి, కూటమి నాయకులతో కలిసి  పంచాయతీ పారిశుద్ధ్య తోపుడు బండిని ప్రారంభించారు. సర్పంచ్ సన్యాసమ్మ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా చెత్తకుండీల్లో వేయాలని సూచించారు. ముఖ్యంగా, అంటువ్యాధులు ప్రబలే ఈ సీజన్‌లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. దోమలు వృద్ధి చెందకుండా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెన్నవరం పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉల్లి రమణ, మర్రి సాంబశివ, టీడీపీ నాయకులు మరిగల చంటిబాబు, పూజారి నాగేశ్వరరావు, గేమ్మెల దన్ను, బురిడీ భాస్కరరావు, జర్త రాజేంద్ర, మువ్వల సత్తిబాబు, మువ్వల నాగేశ్వరరావు, ముర్లు త్రినాధ్, దిప్పల రాజు, సతీష్ వంటి నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments