ఉత్తమ సేవలకు దక్కిన గౌరవం- కిండ్ర పంచాయతీ గ్రామ రెవెన్యూ అధికారి ద్రాక్షాయని రావుకి ఉత్తమ ఉద్యోగి పురస్కారం

ఉత్తమ సేవలకు దక్కిన గౌరవం
కిండ్ర పంచాయతీ గ్రామ రెవెన్యూ అధికారి ద్రాక్షాయని రావుకి ఉత్తమ ఉద్యోగి పురస్కారం

అల్లూరి జిల్లా, రంపచోడవరం డివిజన్, రాజవొమ్మంగి ఆగస్టు 15(సుంకరి ఆనంద్, రంపచోడవరం స్టాఫ్ రిపోర్టర్) : రాజవొమ్మంగి మండలం, కిండ్ర పంచాయతీకి చెందిన గ్రామ రెవెన్యూ అధికారి (VRO) కనిగిరి ద్రాక్షయనిరావుకి ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. పాడేరు జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. కిండ్ర పంచాయతీలో ద్రాక్షయానిరావు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వబడింది. స్థానిక తహసీల్దార్ ఆయన సేవలను గుర్తించి, కలెక్టర్‌కు తెలియజేశారు. ఆయన చేసిన కృషిని ఇంతవరకు మరెవ్వరూ చేయలేదని రాజవొమ్మంగి తహసీల్దార్, తోటి రెవెన్యూ సిబ్బంది కొనియాడారు. ఈ సేవలకు గాను ఆయనను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న తర్వాత ద్రాక్షయానిరావు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డును గుర్తించి నాకు ఇచ్చినందుకు నా తోటి సిబ్బందికి, అలాగే నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. ఈ పురస్కారం తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని, రాబోయే రోజులలో మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా తమ సంతోషాన్ని పంచుకున్నారు. కిండ్ర పంచాయతీ ప్రజల శ్రేయస్సు కోసం ఆయన చేసిన సేవలు అభినందనీయమని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0 Comments