నేడు(సోమవారం) విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు
జిల్లాకలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పాడేరు ఆగస్టు 17 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల సందర్భంగా అన్ని విద్యాసంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 18వ తేదీన (సోమవారం) ఒకరోజు సెలవు ప్రకటించామని జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఒకరోజు పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
0 Comments