సచివాలయ సేవలకు గుర్తింపు: విజయలక్ష్మికి ఉత్తమ ఉద్యోగి పురస్కారం

సచివాలయ సేవలకు గుర్తింపు: విజయలక్ష్మికి ఉత్తమ ఉద్యోగి పురస్కారం
అల్లూరి జిల్లా, రంపచోడవరం డివిజన్, రాజవొమ్మంగి ఆగస్టు 15 (సుంకరి ఆనంద్ రంపచోడవరం స్టాఫ్ రిపోర్టర్): 
పంచాయతీ ప్రజలకు అందిస్తున్న అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా, రాజవొమ్మంగి మండలం, శరభవరం గ్రామ పంచాయతీలోని గ్రేడ్ 2 డిజిటల్ అసిస్టెంట్ జరగడ్డ విజయలక్ష్మి ఉత్తమ ఉద్యోగి (బెస్ట్ ఎంప్లాయి) పురస్కారాన్ని అందుకున్నారు. శరభవరం గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న విజయలక్ష్మి, తన నిబద్ధత, అంకితభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఈ కృషికి గుర్తింపుగా, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, సబ్ కలెక్టర్ అభిషేక్ గౌడ, మరియు ఎస్పీ అమిత్ బర్దర్ చేతుల మీదుగా ఆమెకు ఈ పురస్కారం లభించింది. విజయలక్ష్మికి పురస్కారం లభించినందుకు ఆమె భర్త రాజు, కుటుంబ సభ్యులు, మరియు బంధువులు, సహచర ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ప్రజల సేవలో ఆమె చేస్తున్న కృషికి ఈ అవార్డు ఒక గొప్ప ప్రోత్సాహమని వారు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments