ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి స్వామికి జన్మదిన శుభాకాంక్షలు: అన్వేషణ అప్డేట్ ఎడిటర్ వి ఎస్ జె ఆనంద్

నర్సీపట్నం ఆగస్టు 19:
ఏపియూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బిఎల్ స్వామి కి అన్వేషణ అప్డేట్ ఈ పేపర్ ఎడిటర్ వి ఎస్ జె ఆనంద్ ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పాత్రికేయులను ఐక్యం చేసి, పాత్రికేయుల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు యూనియన్ నాయకుడిగా ఆయన సేవలు అందిస్తున్నారని ఎడిటర్ పేర్కొన్నారు. నిత్యం జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతూ హక్కుల సాధనకై ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లోనూ సీనియర్ జర్నలిస్టుగా, యూనియన్ రాష్ట్ర నేతగా రాణిస్తూనే జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని ఆశిస్తున్నట్టు ఎడిటర్ ఎక్స్ లో పేర్కొన్నారు.

Post a Comment

1 Comments