నేడు పాడేరులో ముఖ్యమంత్రి పర్యటన
జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్
అల్లూరి జిల్లా, పాడేరు, ఆగస్టు 8 (సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు పాడేరులో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం 10.00 గం.లకు పాడేరు మండలం లగిసపల్లిలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారని అన్నారు. 10.25 గం. లకు వంజంగి గ్రామానికి బయలుదేరి వెళతారని, 10.25 గం.ల నుంచి 11.40 గం.ల వరకు దేవాలయ సందర్శన, ఆదివాసీ దినోత్సవంలో భాగస్వామ్యం, గృహాల సందర్శన, కాఫీ తోటల్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. 11.45 గం.ల నుంచి మధ్యాహ్నం 01.05 గం.ల వరకు ప్రజావేదిక, పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు అనంతరం బహిరంగ సభ ఉంటుందని అన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 2.20 గం.లకు లగిసపల్లిలోని హెలిప్యాడ్ కు చేరుకొని విజయవాడకు బయలుదేరి వెళతారని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.
0 Comments