జన సైనికుల విస్తృత స్థాయి సమావేశం విజయవంతం కావాలి- జనసేన నాయకుడు రామకృష్ణ

జన సైనికుల విస్తృత స్థాయి సమావేశం విజయవంతం కావాలి 

జనసేన నాయకుడు రామకృష్ణ

చింతపల్లి ఆగస్టు 20 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఆయన అధ్యక్షతన ఈ నెల 30వ తేదీన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహించనున్న జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం విజయవంతం కావాలని పెదబరడ పంచాయితీ జనసేన నాయకుడు కూడ రామకృష్ణ అన్నారు. ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించే జన సైనికుల విస్తృత స్థాయి సమావేశం ఒక చరిత్రాత్మక ఘట్టం కానుందని అన్నారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తున్నందుకు గానూ సంక్షేమం, అభివృద్ధి, మరియు పరిపాలనలో పార్టీ లక్ష్యాలను ఆయన కార్యకర్తలకు వివరించనున్న నేపథ్యంలో జన సైనికులంతా పాల్గొని విజయవంతం చేద్దామన్నారు. విశాఖ సమావేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి, పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రతి గడపకు తీసుకెళ్లడానికి ఇది ఒక మంచి అవకాశమని ఆ దిశగా తన లాంటి జన సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభను విజయవంతం చేసేందుకు జనసైనికులంతా తరలి రావాలని ఆయన కోరారు.

Post a Comment

0 Comments