ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి - జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి
జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్

పాడేరు ఆగస్టు 11(సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్) : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాహనాలు, పరిశ్రమలు, సేవారంగాలను నెలకొల్పిన 160 మందికి రాయితీలు అందించాల్సి ఉండగా ఒక్కరికి రాయితీ విడుదల చేయడానికి చర్యలు చేపట్టడం లేదని పరిశ్రమల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అర్హులైన లబ్దిదారులను గుర్తుంచి రాయితీలు అందించాలని స్పష్టం చేసారు. ప్రతీ మండలంలోను ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారులగా నియమించి తగిన శిక్షణ అందించాలని చెప్పారు. పది క్లైములు కూడా పరిష్కరించ లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. పరిశ్రమలు, క్రషర్లు నుండి వస్తున్న కాలుష్యాలపై ఫిర్యాదులు వస్తున్నాయని నివారణ చర్యలు చేపట్టలాన్నారు. క్రషర్లను అధికారులు తనిఖీ చేయాలని సూచించారు. 
ఈ సమావేశంలో పాడేరు ఐటిడి ఏ పి ఓ డా. ఎం. జె. అభిషేక్ గౌడ, రంపచోడవరం పి ఓ కె. సింహాచలం, సబ్కలెక్టర్ శౌర్యమన్ పటేల్, జిల్ల పరిశ్రమల అధికారి జి.రవిశంకర్, సహాయ సంచాలకులు ఆర్. వి. రమణారావు, డి ఆర్ డి ఏ పిడి వి.మురళి, కాలుష్య నియంత్ర మండలి ఇ ఇ సరిత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments