టిడిపి సీనియర్ కార్యకర్తలకు సముచిత స్థానం - పిఎసిఎస్ చైర్పర్సన్ అబ్బాయి నాయుడు

టీడీపీ సీనియర్ కార్యకర్తలకు సుముచిత స్థానం 
పీఏసీఎస్ చైర్పర్సన్ అబ్బాయినాయుడు 

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 11 (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్థాఫ్ రిపోర్టర్): టీడీపీలో సీనియర్ కార్యకర్తలకు పార్టీ అదిష్టానం సుముచిత స్థానం కల్పిస్తుందని నూతనంగా నియమితులైన పీఏసీఎస్ చైర్ పర్సన్ గెమ్మెలి అబ్బాయి నాయుడు అన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో సుమారు 30ఏళ్లగా కార్యకర్తగా పని చేస్తున్నానన్నారు. తన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం పీఏసీఎస్ చైర్పర్సన్గా నియమించడంపై సంతో షంగా ఉందన్నారు. తనను పీఏసీఎస్ చైర్పర్సన్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నియోజక వర్గం ఇన్చార్జి గిడ్డి ఈశ్వరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments