అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని విజయవంతం చేయండి - అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి 
సభా ప్రాంగణంలో గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు

అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు 

అల్లూరి జిల్లా చింతపల్లి ఆగస్టు 8 (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్) :
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం  చేయాలని 
అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు దేపూరు శశికుమార్, జిల్లా కార్యదర్శి గెమ్మెలి మోహన్ రావు, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ యూవీ గిరి, చింతపల్లి మండల అద్యక్షులు బౌడు గంగరాజు అన్నారు. శనివారం (నేడు) జరగనున్న ఆదివాసీ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం వారు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనుమరుగవుతున్న ఆదివాసీ చట్టాలను పరిరక్షించుకోవడానికి ఆదివాసీ ప్రజానీకం అంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. 1/70 చట్టం, జీఓ నంబర్ 3 వంటి ఆదివాసీ చట్టాలను కాపాడుకోవలసిన భాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. చింతపల్లిలో నేడు జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సంలో అధిక సంఖ్యలో ఆదివాసీ సోదర సోదరీమణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గూడెం కొత్త వీధి మండలం డి టి దుమంతి సత్యనారాయణ,  జన జాగృతి రాష్ట్ర అధ్యక్షులు ముర్ల వెంకటరమణ, కోశాధికారి గెమ్మెలి మోహన్ రావు, సెక్రటరీ పొటుకూరి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అద్యక్షులు రీమల నవభరత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments