కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
లోతుట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తం చేయాలి
ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి
జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్
పాడేరు, ఆగష్టు 17(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ అన్నారు.
రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని, అన్ని శాఖలు సమన్వయంతో లోతుట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదివారం టెలికాన్ఫెరెన్స్ లో జిల్లాలోని అధికారులు ముఖ్యంగా జలవనరులు, రెవిన్యూ, పోలీసు,రవాణా, మత్స్యశాఖ, పంచాయతీ రాజ్, రహదారులు భవనాలు, వ్యవసాయ తదితర శాఖల అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.
కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలని, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తం చేయాలన్నారు. కావలసిన జనరేటర్లు, త్రాగునీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దండోరా వేసి ప్రజలకు అప్రమత్తం చేయాలన్నారు. నిత్యావసర సరుకుల పంపిణి పై ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్ అండ్ బి, ఈపిడిసిఎల్, వైద్య ఆరోగ్య, మత్స్య సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు అప్రమత్తం అవసరమన్నారు. మత్స్యకారులు ఎవరు వేటకి వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. ముంపుకు గురైన ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను తుఫాన్ రిలీఫ్ కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైనచోట్ల లోతట్టు ప్రాంత ప్రజలను ముఖ్యంగా గర్భవతులు, పాలిచ్చు తల్లులు, చిన్నారులు, వృద్ధులను, వైద్య సహాయం అత్యవసరంగా కావలసినవారిని ప్రత్యేక శ్రద్ధతో పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కావలసిన ముందస్తు చేర్యలు చేపట్టాలన్నారు. అలాగేఎక్కడైనా రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం కలిగితే పునరుద్ధరణ పనులు తక్షణమే చేపట్టాలన్నారు.
ఈ టెలికాన్ఫెరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, రంపచోడవరం, చింత్తూరు ప్రాజెక్ట్ ఆఫీసర్స్, జిల్లా రెవెన్యూ అధికారి కె పద్మలత, ప్రత్యేక ఉప కలెక్టర్లు, చింత్తూరు డివిజనల్ స్థాయి ఆదికారులు, వివిధ శాఖల అధికారులు సంబంధిత మండలాల ఎంపిడిఓలు, తహసీల్దార్లు ఉన్నారు.
0 Comments