పాడేరులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు - జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పాడేరు, ఆగష్టు 15 (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్):  భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా (పాడేరు)లో జరిగిన వేడుకలకు జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ ముఖ్య అతిధిగా పాల్గొని అల్లూరి సీతారామ రాజు విగ్రహనికి పూలమాలలు వేసి తదుపరి మువన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చేందుకు అనేకమంది తమ ప్రాణాలు సహితం త్యాగాలు చేశారని,  ఆ మహనీయులందరి త్యాగాలను మనందరం ఒకసారి స్మరించు కోవాల్సిన శుభదినం నేడని పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధి,రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, అల్లూరి సీతారామ రాజు వంటి మహనీయులతో పాటు ఆనాడు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధులు వారి త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిద్దామని చెప్పారు. అనంతరం జాయింట్ కలెక్టర్, సహాయ కలెక్టర్ చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ సాహిత్, జిల్లా రెవెన్యూ అధికారి కె. పద్మాలత, వివిధ శాఖల అధికారులు సిబ్బంది ఉన్నారు.

Post a Comment

0 Comments