ఉత్పత్తి, వినియోగం నివారించడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి
గంజాయి వినియోగం సమాజానికి చేటు
జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్
పాడేరు, ఆగష్టు 14 (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): గంజాయి వినియోగం సమాజానికి చేటని, గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ స్పష్టం చేసారు.
గురువారం కలెక్టరెట్ సమావేశ మందిరంలో ఈగల్, పోలీస్, వ్యవసాయశాఖ, అటవీశాఖ, ఉద్యానవన శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, ఐసిడిఎస్, ఎక్సైజ్, అటవీ శాఖ, డిఆర్డిఏ, సిపిఓ, డ్వామా, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో గంజూయి నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై సమీక్షా సమావేశం నిర్వహంచారు. సమావేశాలకు హాజరైన సంబంధిత శాఖల అధికారులు పూర్తి డేటా తో హాజరు కావాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి ఉత్పత్తి, రవాణా, వినియోగం పై దృష్టి సారించి వినియోగం తప్పు అన్న విషయాన్ని విద్యార్థులకు అవగాహనా కల్పించాలన్నారు. అన్ని శాఖలు ప్రణాళికలు సిద్ధం చేసుకొని గంజాయి నిర్మాలనపై ప్రజల్లో అవగాహనా కల్పించాలన్నారు. గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలలో గంజాయి వినియోగంపై కలిగే నష్టాలపై కళాశాలల్లో అవగాహనా సదస్సులు, డి.ఎడిక్షన్ సెంటరుకు ఎంత మంది వచ్చారని, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గంజాయి సాగు చేసే రైతులు, సరఫరాదారులు పై ప్రత్యేక దృష్టి పెట్టి అటు వంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి విడిచి పెట్టిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, స్వయం ఉపాధి పథకాలు, బ్యాంకు రుణాలు, పశువులు, మేకలను మంజూరు చేయాలని స్పష్టం చేసారు. ఉత్పత్తి, వినియోగం నివారించడానికి సంబంధిత శాఖలు రోడ్ మ్యాప్ (యాక్షన్ ప్లాన్) చేయాలన్నారు.
జిల్లా ఎస్సీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలన్నారు. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా వారి స్థిర, చరాస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గంజాయి స్మగ్లర్లకు గిరిజన గ్రామాల్లో ఆశ్రయం కల్పించడం నేరమని అన్నారు. బస్టాండ్లలో పటిష్టమైన నిఘా పెట్టామన్నారు. జాతీయ విద్యా విధానాన్ని సక్రమంగా అమలు చేయాలన్నారు. అనంతరం గంజాయి నిర్మూలన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ముందుగా ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిడికి పాఠశాలలు సందర్శించి విద్యార్థుల్లో మార్పులను గుర్తించి వారికీ అవగాహనా అందజేయాలన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ్, రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమన్, డిఎఫ్ఓ పి వి సందీప్ రెడ్డి, (వర్చువల్), జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీరావు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి ఝాన్సీ రామ్ పడాల్, ట్రైబల్ వెల్ఫేర్ డిడి క్రాంతి, సిపిఓ పి.ప్రసాద్, ఎల్డిఎం మాతునాయుడు, ఈగల్ టీమ్ అనిల్, వివిద శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
0 Comments