రైతు ఉత్పత్తిదారుల సంఘాలను గ్రూప్ లుగా ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్
పాడేరు, ఆగష్టు 13(సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): రైతు ఉత్పత్తిదారుల సంఘాలు గ్రూప్ లుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎఎస్.దినేష్ కుమార్ స్పష్టం చేసారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాన్ఫరెన్సు మందిరంలో సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారో ఆకాంక్ష కార్యక్రమం జరిగింది.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారో కార్యక్రమనికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టాయన్నారు. జిల్లాలో గంగవరం, మారేడుమిల్లి, వై.రామవరం మండలాలు గుర్తించడం జరిగిందన్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లా కు 27 కోట్లు నీటి అయోగానుంచి వచ్చిందన్నారు. రైతు ఉత్పత్తిదారుల ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నారు. గిరిజనులకు గ్రూప్ గా ఏర్పాటు చేసి వారికి ఋణలు అందజేయాలని తద్వారా వారిలో ఆత్మ స్థైర్యాన్ని పెపొందించవచ్చన్నారు. ప్రభుత్వం నుండి ఎంత సహాయ సహకారాలు అందించినా వారిలో ఆత్మ స్థైర్యాన్ని సాటిరావన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మన జిల్లాకి అధిక ప్రాముఖ్యత నిస్తున్నారన్నారు. మరింత అభివృద్ధికి అందరు సమన్వయతో ముందుకు సాగాలన్నారు. పాడేరు కాఫీ హౌస్ లో రైతు ఉత్పత్తులను ప్రోత్సాహం కల్పించేందుకు 10 స్టాల్స్ లో రైతు ఉత్పత్తులను ఆకాంక్ష హర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ రాష్ట్రం లో 114 ఆకాంక్ష జిల్లాలుగా గుర్తించారని అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా ఉందన్నారు. జిల్లాలో గంగవరం, మారేడుమిల్లి, వై రామవరం మండలాలు గుర్తించడం జరిగిందన్నారు. ఈ మండలంల్లో విద్యా, వైద్య, ఐసిడిఎస్, డిఆర్డిఎ శాఖలు, యంపిడిఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
మాజీ శాసన సభ్యులు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఆగష్టు 9 వ తేదీన ఆదివాసీ దినోత్సవం ఏర్పాట్లు పై, ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారో కార్యక్రమనికి ప్రాధాన్యత నిచ్చిందన్నారు. ఇటువంటి కార్యక్రమం విజయవంతం కావడానికి జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం ప్రధానం అన్నారు. గ్రౌండ్ స్థాయికి పధకాలు అందజేయడానికి ప్రతీ ఒక్కరూ అంకితం భావంతో పనిచేస్తున్నారన్నారు.
యంపిడిఓలు, ఎబియం మాట్లాడుతూ ఆకాంక్ష క్రింద విద్యా, వైద్య, న్యూట్రిషన్ పై సంబంధిత శాఖల సమన్వయంతో ముందుకు వెళుతున్నామన్నారు. డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం పధకం ద్వారా మంచి న్యూట్రిషన్ ఆహార అందజేయడం జరుగుతుంది.
సోయిల్ టెస్టింగ్స్ జరుగుతున్నాయాన్నారు. గంగవరం, మారేడిమిల్లి, వై.రామవరం మండలాల్లో అంబులెన్సు సౌకర్యాలు కల్పించాలన్నారు.
నిర్దేశిత సూచికలు అమలుకు కృషి చేసిన డిఇఓ పి.బ్రహ్మజీ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎన్ నంద్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విశ్వేశ్వర నాయుడు, డిఆర్డిఎ పిడి మురళీ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి ఝాన్సీ రామ్ పడాల్ కు, గంగవరం, మారేడిమిల్లి, వై రామవరం మండలాల ఎంపిడిఓలకు, ఎబిఎఫ్. లకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమం లో నీటి అయోగ్ ప్రోగ్రాం అధికారి నారాయణ రెడ్డి, సిబ్బంది రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు ఉన్నారు.
0 Comments